![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -993 లో.... ఒంటరిగా ఉన్న వసుధారని రాజీవ్ లాక్కొని వెళ్తుంటాడు. అప్పుడే అక్కడికి ఓ అజ్ఞాతవ్యక్తి వస్తాడు. ఎక్స్ క్యూజ్ మి అని అతను అనగానే. వసుధార, రాజీవ్ ఇద్దరు అతని వంక చూస్తారు. ఇక అటువైపు తిరిగి అతడిని చూసిన రాజీవ్.. ఎవరు నువ్వు.. అడ్రెస్ కావాలా అని అడుగుతాడు. కాదు ఆ అమ్మాయిని వదిలేయ్ అని అతను అనగానే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని లాక్కొని వెళ్తుంటాడు. ఇక అతను వచ్చి రాజీవ్ చేతిని పట్టుకుంటాడు. చేతిని వదులు అని అతను అన్నా సరే రాజీవ్ వదలకుండ.. వదలని ఏం చేస్తావని పొగరుగా మాట్లాడతాడు. ఇక అతను గన్ తీసి రాజీవ్ కి గురి పెడతాడు. ఆమెని వదలకపోతే నిజంగానే కాలుస్తానని అతను అనగానే..కాసేపు ఆలోచించిన రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
రాజీవ్ వెళ్ళగానే.. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తానని వసుధారని ఆ అజ్ఞాతవ్యక్తి అడుగగా.. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మీరు వెళ్ళిపోండి అని అంటుంది. దాంతో అతను వెళ్ళిపోతాడు. మరోవైపు రిషి చనిపోయాడని ఇంట్లోవాళ్ళంతా అతడి ఫోటోకి దండ చేసి ఏడుస్తుంటారు. ఇక కాసేపటికి అక్కడికి వసుధార వచ్చి రిషి ఫోటోకి దండ చేసి ఉండటం గమనించి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోటోకి ఉన్న దండ అవన్నీ తీసి పారేస్తుంది. ఎవరు ఈ పని చేసింది. మీరంతా ఏం అనుకుంటున్నారు.. నా రిషి సర్ బ్రతికే ఉన్నాడు అని వసుధార ఎమోషనల్ అవుతుంది. మీకేం కాలేదు కదా సర్ అంటు రిషి ఫోటోని చూసి ఎమోషనల్ గా మాట్లాడుంది. అది చూసి మహేంద్ర, అనుపమ, ధరణి అందరు ఎమోషనల్ అవుతారు. ఇక ఆ ఫోటోకి దండ అవన్నీ తీసేసిన వసుధారని బెదిరిస్తుంది దేవయాని. అలా చనిపోయిన వారి ఫోటోకి ఉన్నవాటిని అలా తీయకూడదని, అది అరిష్టమని వసుధార అంటుంది. మీరు నా కళ్ళముందు ఉండకండి.. మీరు మీ కొడుకు శైలేంద్ర ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని వసుధార కోపంగా చెప్తుంది. దాంతో ధరణి, దేవయాని, శైలేంద్ర అక్కడి నుండి వెళ్తారు.
మరోవైపు ఓ చోట అనుపమ, ముకుల్ ఇద్దరు కలుసుకొని మాట్లాడుతుంటారు. అసలు రిషి నిజంగానే చనిపోయాడా అని ముకుల్ ని అడుగగా.. హాస్పిటల్ లో ఉన్న బాడీ DNA.. మన మహేంద్ర DNA తో మ్యాచ్ అయింది. అది చూడగానే నా గుండె ఆగినంత పనైందని ముకుల్ అంటాడు. మళ్ళీ మళ్ళీ చెక్ చేసావా అని అనుపమ అడుగుతుంది. ఎందుకు మేడమ్ అలా అడుగుతున్నారని ముకుల్ అనగా.. రిషి బ్రతికే ఉన్నాడని వసుధార అంటుందని చెప్తుంది. రిషిని చంపిందెవరో అని నీకెవరిమీదైనా అనుమానం ఉందా అని అనుపమ అనగా.. భద్ర అని ముకుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |